జియో సైంటిస్ట్‌గా ఆది సాయికుమార్

జియో సైంటిస్ట్‌గా ఆది సాయికుమార్
X
కెరీర్ ప్రారంభంలో మాస్, రొమాంటిక్ చిత్రాలతో ప్రయోగాలు చేసిన హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు వరుసగా వైవిధ్యభరిత సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.

కెరీర్ ప్రారంభంలో మాస్, రొమాంటిక్ చిత్రాలతో ప్రయోగాలు చేసిన హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు వరుసగా వైవిధ్యభరిత సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని ప్రయత్నాలు బాగున్నా.. విజయాలే దక్కడం లేదు. ‘షణ్ముఖ‘ వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తర్వాత ఇప్పుడు ‘శంబాల‘ అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

ఆధ్యాత్మికతతో కూడిన సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ‘శంబాల‘ రూపొందుతుంది. ‘శంబాలా‘ సినిమా కథ ఒక ఊహాజనిత ప్రపంచం చుట్టూ తిరుగుతుందని చిత్రబృందం చెబుతుంది. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతుండగా, అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. లేటెస్ట్ గా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. త్వరలో టీజర్ రానుందట.

అద్భుతమైన విజువల్స్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుందట. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందించబోతుందనే నమ్మకంతో ఉన్నాడు ఆది సాయికుమార్. ‘ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్’ ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.



Tags

Next Story