జపనీస్ భాషలోకి సూపర్ స్టార్ చిత్రం !

సౌత్ ఇండియన్ సినిమా గర్వించే సూపర్ స్టార్ రజనీకాంత్ తన గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయస్సులో కూడా అదే ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ, తన స్టైల్, మేనరిజం, మాస్ అప్పీల్‌ను కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం రజనీ "కూలీ", "జైలర్ 2" చిత్రాలతో బిజీగా ఉండగా.. మరోవైపు జపాన్ ప్రేక్షకులను కూడా తన నటనతో మెస్మరైజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. రజనీకి జపాన్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఆయన నటించిన "ముత్తు" సినిమా అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. అదే ఊపును కొనసాగిస్తూ, ఇప్పుడు "జైలర్" చిత్రాన్ని జపనీస్ భాషలోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.
2023లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన "జైలర్" బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి.. రూ. 650 కోట్ల వసూళ్లను సాధించింది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ వంటి స్టార్ల ప్రత్యేక పాత్రలు సినిమాకు మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి. ఈ సినిమా ఫిబ్రవరి 21న జపాన్ ప్రేక్షకులను అలరించనుంది. "జైలర్" విజయాన్ని బట్టి సీక్వెల్ "జైలర్ 2" ను కూడా జపాన్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. రజనీ మ్యాజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎలా కొనసాగుతుందో చూడాలి!
-
Home
-
Menu