మహేష్-నమ్రత జంటకు స్పెషల్ డే!

X
టాలీవుడ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన కపుల్స్‌లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ ఒకరు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట, 20 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఆనందంగా పూర్తి చేసుకుంది. ఈరోజు తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు 'నువ్వు, నేను.. 20 అందమైన సంవత్సరాలు.. ఎప్పటికీ నీతోనే' అంటూ నమ్రతకి తమ వెడ్డింగ్ యానివర్శరీ విషెస్ తెలిపాడు మహేష్.
ఇన్‌స్టాగ్రామ్ లో మహేష్ చేసిన ఈ పోస్ట్‌పై అభిమానులు, సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'వంశీ' సినిమా సెట్స్‌లో మొదలైన మహేష్-నమ్రత ప్రేమకథ, పెళ్లి తర్వాత మరింత బలపడింది. వీరిద్దరూ తమ కుటుంబ జీవితంలో సంతోషాన్ని పంచుకుంటూనే సమాజ సేవలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu