ఘట్టమనేని వారసుడు సినిమాకి సన్నాహాలు

X
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త వారసుడు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త వారసుడు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘RX 100‘ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
అజయ్ భూపతి గతంలో ‘RX 100, మహా సముద్రం, మంగళవారం‘ వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను చూపించాడు. ఇప్పుడు జయకృష్ణతో కూడా ఓ విలక్షణమైన కథను తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక సంస్థలు వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
Next Story
-
Home
-
Menu