'కల్ట్'తో కొత్త ప్రయోగం

కల్ట్తో కొత్త ప్రయోగం
X
'లైలా' సినిమా పరాజయం తర్వాత విశ్వక్ సేన్ ఇప్పుడు హిట్ కొట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇప్పటికే అనుదీప్ కె.వి. దర్శకత్వంలో ‘ఫంకీ‘ సినిమా చేస్తున్న విశ్వక్.. లేటెస్ట్ గా మరో కొత్త సినిమా ‘కల్ట్‘కి శ్రీకారం చుట్టాడు.

'లైలా' సినిమా పరాజయం తర్వాత విశ్వక్ సేన్ ఇప్పుడు హిట్ కొట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. ఇప్పటికే అనుదీప్ కె.వి. దర్శకత్వంలో ‘ఫంకీ‘ సినిమా చేస్తున్న విశ్వక్.. లేటెస్ట్ గా మరో కొత్త సినిమా ‘కల్ట్‘కి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా దర్శకుడిగానూ డబుల్ ధమాకా అందించడానికి సిద్ధమవుతున్నాడు.

ఈరోజు ‘కల్ట్‘ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యింది. తారక్ సినిమాస్ & వణ్మయి క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీని పాన్ ఇండియా కాదు పాన్ గ్లోబల్ ట్యాగ్ తో రెడీ చేస్తున్నాడు విశ్వక్. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ వంటి భాషల్లో విడుదల చేయనున్నాడట. ఈ సినిమాకి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్ పనిచేస్తున్నాడు.

Tags

Next Story