భారత వినోద పరిశ్రమకు కొత్త దిశ ‘వేవ్స్’ సమ్మిట్!

భారత వినోద పరిశ్రమకు కొత్త దిశ ‘వేవ్స్’ సమ్మిట్!
X
భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్)ను ఈ ఏడాది చివర్లో నిర్వహించనుంది.

భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్)ను ఈ ఏడాది చివర్లో నిర్వహించనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగే విధంగా, ప్రపంచ వినోద పరిశ్రమ కోసం ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సినీ, పారిశ్రామిక రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, రజనీకాంత్, అమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకొణె, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదితరులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ 'ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం గౌరవంగా ఉంది. నా ఆలోచనలు పంచుకునే అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు' అని సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సమ్మిట్ భారత వినోద రంగానికి గ్లోబల్ ప్లాట్‌ఫామ్ కల్పించనుంది.

Tags

Next Story