200 కోట్లు దాటేసిన చిత్రం

200 కోట్లు దాటేసిన చిత్రం
X
భారతీయ యానిమేషన్ సినిమాలపై ఉన్న అభిప్రాయాలను తలకిందులు చేస్తూ, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

భారతీయ యానిమేషన్ సినిమాలపై ఉన్న అభిప్రాయాలను తలకిందులు చేస్తూ, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. జూలై 25న విడుదలైన ఈ మైథలాజికల్ యానిమేటెడ్ మూవీ 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

మొదటి రోజు రూ.2.3 కోట్లతో సాధారణంగా ప్రారంభమైన ఈ చిత్రం, పాజిటివ్ మౌత్ టాక్‌తో కలెక్షన్లు పెంచుకుంటూ వెళ్లింది. ఈ సినిమా విజయానికి కారణం నరసింహ స్వామి కథను భక్తి, భావోద్వేగాలతో శక్తివంతంగా చూపించడం. దర్శకుడు అశ్విన్ కుమార్ నమ్మకం, హోంబలే ఫిల్మ్స్ మద్దతు, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఈ విజయానికి బలమైన కారణాలు.

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', అజయ్ దేవగన్ 'సన్ ఆఫ్ సర్దార్ 2' వంటి భారీ చిత్రాలతో పోటీ పడుతూ కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. 'మహావతార్ నరసింహ' మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి భాగం. ఇంకా ఈ సినిమాటిక్ యూనివర్శ్ లో 'పరశురామ్, రఘునందన, ద్వారకాధిష్, గోకులనంద, కల్కి 1, కల్కి 2' వంటి సినిమాలు రానున్నాయి.



Tags

Next Story