‘బేబీ‘ మేకర్స్ నుంచి ‘కల్ట్‘ మూవీ!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్. నిర్మించిన ‘బేబీ‘ సినిమా ఘన విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా రూ.80 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ‘బేబీ‘ తర్వాత ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ ‘కల్ట్‘ పేరుతో కొత్త సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
జూన్ 2న ‘కల్ట్‘ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఇద్దరు ప్రేమికులు నడుచుకుంటూ వెళుతుండగా.. ఆ పక్కన ఓ బడ్డీ కొట్టు బండి మీద కె.బాలచందర్ ఫోటో కనిపిస్తుంది. ఈ పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. మొత్తంగా ‘బేబీ‘ కాంబోలో వస్తోన్న ఈ మూవీతో మరోసారి ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి.
మనసుకు నచ్చిన సినిమా మొదలు పెట్టా
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) May 31, 2025
టైటిల్ గ్లింప్స్ మీకు చూపించటానికి ఉత్సాహంగా ఉన్నా
Need all of ur blessings ❤️🙏
A NEW CULT is LOADING! 🔥
From the makers of CULT BLOCKBUSTERS #ColourPhoto & #Baby ❤️🔥
A #ManiSharma Musical Magic 🎹
Title & Glimpse dropping this MONDAY, JUNE… pic.twitter.com/cLH70zw2Js
-
Home
-
Menu