నాలుగు చిత్రాలలో కామన్ ట్విస్ట్!

ఈ వారం బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. నిన్న తమిళం నుంచి 'వీర ధీర శూర 2', మలయాళం నుంచి 'ఎంపురాన్' అనువాద రూపంలో రాగా.. ఈరోజు తెలుగు నుంచి 'మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్' చిత్రాలు విడుదలయ్యాయి.
ఈ నాలుగు చిత్రాలలో మోహన్ లాల్ 'ఎంపురాన్' పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తే.. విక్రమ్ 'వీర ధీర శూర 2' ఒక రాత్రిలో జరిగే డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఇక 'రాబిన్‌హుడ్' యాక్షన్ ఎంటర్ టైనర్ కాగా, 'మ్యాడ్ స్క్వేర్' ఫన్ ఎంటర్ టైనర్. ఇలా ఈ నాలుగు చిత్రాలు వేటికవే విభిన్నమైన జానర్స్ లో వచ్చినా.. ఈ సినిమాలన్నింటిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది.
'లూసిఫర్'కి సీక్వెల్ గా 'ఎంపురాన్' వచ్చింది. 'ఎంపురాన్'కి కూడా మరో సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'L3 – ది బిగెనింగ్' అంటూ 'లూసిఫర్' సిరీస్ లో థర్డ్ పార్ట్ ను ప్రకటించారు. ఇక విక్రమ్ మూవీ 'వీర ధీర శూర' విడుదలవ్వడమే సెకండ్ పార్ట్ వచ్చింది. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా 'వీర ధీర శూర-1' రానుంది.
మరోవైపు 'మ్యాడ్'కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్' వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ లో థర్డ్ పార్ట్ గా 'మ్యాడ్ క్యూబ్' రానుందని ప్రకటించారు మేకర్స్. అసలు ట్విస్ట్ ఏమిటంటే 'రాబిన్‌హుడ్'కి కూడా సీక్వెల్ అనౌన్స్ చేయడం. 'రాబిన్‌హుడ్'కు కొనసాగింపుగా 'బ్రదర్‌హుడ్ ఆఫ్ రాబిన్‌హుడ్' అనౌన్స్ చేశారు మేకర్స్.
-
Home
-
Menu