‘కె-ర్యాంప్’ నుంచి కలర్‌ఫుల్‌ సాంగ్

‘కె-ర్యాంప్’ నుంచి కలర్‌ఫుల్‌ సాంగ్
X
యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న 11వ చిత్రం ‘కె-ర్యాంప్’. అక్టోబర్‌ 18న ఈ సినిమా విడుదల కానుంది. జైన్స్‌ నాని దర్శకత్వంలో, రాజేష్‌ దండా - శివ బొమ్మకు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న 11వ చిత్రం ‘కె-ర్యాంప్’. అక్టోబర్‌ 18న ఈ సినిమా విడుదల కానుంది. జైన్స్‌ నాని దర్శకత్వంలో, రాజేష్‌ దండా - శివ బొమ్మకు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్‌ సాంగ్’ విడుదలైంది.

చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం, సురేంద్ర కృష్ణ లిరిక్స్‌తో వచ్చిన ఈ పాటను చేతన్‌ భరద్వాజ్‌, సాహితి చాగంటి పాడారు. మలయాళీ భామతో ప్రేమలో పడిన హీరో భావాలపై సాగిన ఈ పాటలో కిరణ్‌ అబ్బవరం – యుక్తి తరేజా కలర్‌ఫుల్ లుక్స్, ఎనర్జిటిక్ డాన్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘క’ విజయంతో మంచి ఫామ్ లో ఉన్న కిరణ్ కి ఆ తర్వాత వచ్చిన ‘దిల్ రూబా‘ నిరాశపరిచింది. అయితే.. మళ్లీ ‘క‘ సెంటిమెంట్ తో ఇప్పుడు ‘కె ర్యాంప్‘ను తీసుకొస్తున్నాడు.


Tags

Next Story