‘8 వసంతాలు‘ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్

‘8 వసంతాలు‘ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్
X
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సందీప్, తన సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ పై నిర్మాతగా ఒక ప్రేమకథా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో వేణు అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడట.

ఈ సినిమాలో ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనుండగా.. హీరోయిన్ గా అనంతిక సనీల్ కుమార్ ఫిక్స్ అయ్యిందట. ‘మ్యాడ్, 8 వసంతాలు’ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ కి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఆద్యంతం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందట. త్వరలో ఈ మూవీని అనౌన్స్ చేయనున్నాడట సందీప్ రెడ్డి వంగా.

Tags

Next Story