‘8 వసంతాలు’ టీజర్.. ప్రేమ, బాధ, మార్షల్ ఆర్ట్స్!

‘8 వసంతాలు’ టీజర్.. ప్రేమ, బాధ, మార్షల్ ఆర్ట్స్!
X
మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తోన్న సినిమా '8 వసంతాలు'. 'మధురమ్, మను' మూవీస్ ఫేమ్ ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఒకవైపు అగ్ర కథానాయకులతో భారీ బడ్జెట్ లో భారీ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈకోవలోనే మైత్రీ నుంచి వస్తోన్న సినిమా '8 వసంతాలు'. 'మధురమ్, మను' మూవీస్ ఫేమ్ ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇతర కీలక పాత్రలను రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి పోషిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది.

‘8 వసంతాలు‘ టీజర్ 1 టైటిల్ తో రిలీజైన ఈ టీజర్ ఆద్యంతం ప్రేమలో విఫలమైన వ్యక్తి బాధ ఎలా ఉంటుందని అని ఆవిష్కరిస్తుంది. ఆమధ్య ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ లో అనంతిక మార్షల్ ఆర్ట్స్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా రొమాంటిక్ అండ్ మెస్సేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో ‘8 వసంతాలు‘ రాబోతున్నట్టు ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ మరో ప్లాస్ పాయింట్ అని చెప్పాలి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story