10 రోజుల్లో 32 కోట్లు

X
చిన్న చిత్రంగా మొదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. మౌళి, శివాని హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సాయి మార్తాండ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
చిన్న చిత్రంగా మొదలై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. మౌళి, శివాని హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సాయి మార్తాండ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, జై కృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య హాసన్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని బన్నీ వాస్, వంశీ నందిపాటి గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కేవలం రూ.2.5 కోట్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ, విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.32.15 కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ ఈ చిత్రం బాగా నచ్చింది.
Next Story
-
Home
-
Menu