అనుష్క ‘ఘాటీ’ లో ఆ హీరో క్యామియో రోల్ ?

అనుష్క ‘ఘాటీ’ లో ఆ హీరో క్యామియో రోల్ ?
X
క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘ఘాటీ’. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా విడుదల

క్రిష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘ఘాటీ’. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ .. విడుదలకు ముందే మంచి అంచనాలు సొంతం చేసుకుంది ఈ సినిమా. అనుష్క ఛాలెంజింగ్ రోల్ ను పోషిస్తుండగా.. ఇందులోని క్యామియో రోల్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ పాత్రలో ఓ ప్రముఖ హీరో కనిపించనున్నాడని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో Rana Daggubati to have a cameo role in Anushka's 'Ghaati'? నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘ఘాటీ’ సినిమా థియేటర్లలో విడుదల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం అనుష్క, ‘ఘాటీ’తో పాటు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తుండగా, ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఘాటీ’ మూవీ క్రిష్, అనుష్క కాంబినేషన్‌లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story