బాలయ్య మాస్ రచ్చ.. ఓటీటీలోనూ అదే జోరు!

బాలయ్య మాస్ రచ్చ.. ఓటీటీలోనూ అదే జోరు!
X

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‘ సినిమా థియేటర్లలో ఘన విజయాన్ని సాధించింది. సంక్రాంతి బరిలో విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. లేటెస్ట్ గా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నెట్ ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. పలు భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి ఉంది.

ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అవ్వగానే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది ‘డాకు మహారాజ్‘. బాలకృష్ణ మాస్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్. థియేటర్స్‌లో వీక్షించలేకపోయిన అభిమానులు ఓటీటీలో చూడడం ద్వారా మంచి అనుభూతిని పొందుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

సితార సంస్థ నిర్మించిన ఈ సినిమాకి డైరెక్టర్ బాబీ టేకింగ్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా వర్క్ టెక్నికల్ గా ఎంతో ప్లస్ అయ్యాయి. బాలయ్య కెరీర్ లోనే సాంకేతిక పరంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన చిత్రంగానూ ‘డాకు మహారాజ్‘కి పేరొచ్చింది.

Tags

Next Story