‘హిచ్‌కాక్’ బుక్ లాంఛ్ చేసిన మెగాస్టార్!

X
‘హిచ్‌కాక్’ బుక్ లాంఛ్ చేసిన మెగాస్టార్!సస్పెన్స్ థ్రిల్లర్స్ రూపొందించడంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్. ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ రెండో ఎడిషన్ ను తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ, ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడి సంయుక్తంగా రచించారు.
‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ రెండో ఎడిషన్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. హిచ్‌కాక్ సినిమాలను తన విద్యార్థి దశలో చూసిన అనుభూతులను ఈ సందర్భంగా చిరంజీవి పంచుకున్నారు. తెలుగులో ఇలాంటి రచన వెలువడటం అభినందనీయం అని ప్రశంసించారు.
Next Story
-
Home
-
Menu