ఇంత అందాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యామా?

ఇంత అందాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యామా?
X

ఇంత అందాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యామా?కాయాదు లోహర్—తెలుగులో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న పేరు. తెలుగు ప్రేక్షకులకు 'అల్లూరి' సినిమాతో పరిచయమైనా, ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమె పేరు పెద్దగా వినిపించలేదు. అయితే, తమిళంలో ప్రదీప్ రంగనాధన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమాలో కీలక పాత్రలో మెరిసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కాయాదు, ఊహించని విధంగా ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తమిళ సినీ ప్రేమికులు ఆమె అందానికి ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. "ఇంత అందాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యాం!" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రేజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, కాయాదు ఇప్పుడు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్టును పట్టేసింది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న "ఫంకీ" సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆమెకు తెలుగులో స్ట్రాంగ్ ఫుట్‌హోల్డ్ ఏర్పరచే అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా, కాయాదు లోహర్ ఇప్పుడు తన కెరీర్‌ను సరికొత్త గేర్‌లో వేయడానికి సిద్ధమవుతోంది!

Tags

Next Story