సెకండ్ షెడ్యూల్ లో మెగా 157!

సెకండ్ షెడ్యూల్ లో మెగా 157!చిరంజీవి, అనిల్ రావిపూడి 'మెగా 157' ప్రస్తుతం హై స్పీడ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. లేటెస్ట్ గా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. సెకండ్ షెడ్యూల్ ముస్సోరీ, డెహ్రాడూన్ వంటి అందమైన లొకేషన్లలో మొదలుకానుంది. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు. మొత్తంగా అనిల్ స్పీడ్ చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ చాలా త్వరగా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి ప్లస్ కానుందని భావిస్తోంది టీమ్. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా 157 రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈలోగా మెగాస్టార్ నటించిన మరో భారీ చిత్రం 'విశ్వంభర' కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో-ఫాంటసీ ఫిల్మ్‌లో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనుల్లో ఉంది. విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.
-
Home
-
Menu