‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ రిలీజ్ కు రెడీ అవుతోంది!

పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్లు భారీ విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం మూడో సీజన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అలాగే ఈ సీజన్ అవుట్‌పుట్ అద్భుతంగా ఉందని బృందం నుంచి తాజా అప్‌డేట్ వెలువడింది.
ఈ సీజన్ గురించి ముఖ్య నటుడు మనోజ్ బాజ్‌పేయీ కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చారు. "సరికొత్తగా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మీ ముందుకు రాబోతున్నాడు" అని ఆయన వెల్లడించారు. ఈసారి కూడా మనోజ్ బాజ్‌పేయీ దేశభక్తి పరమైన గూఢచారి పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీ పాత్రలో కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రియమణి, షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మొత్తానికి, ఇప్పటికే ప్రజల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి తారాస్థాయికి చేరింది. మూడో సీజన్ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
Home
-
Menu