రణవీర్ సింగ్ 'శక్తిమాన్' లో వామికా గబ్బి?

శక్తిమాన్ అనే ఫేమస్ ఇండియన్ సూపర్ హీరో పాత్రకు బాలీవుడ్ వెర్షన్ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అతడి సరసన వామికా గబ్బి హీరోయిన్‌గా నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని 'మిన్నల్ మురళి' ఫేమ్ బేసిల్ జోసఫ్ దర్శకత్వం వహించనుండగా, ఇది దాదాపు ఐదేళ్లుగా అభివృద్ధి దశలో ఉంది. ఈ చిత్రం షూటింగ్ 2025 మేలో ప్రారంభమై, 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వామికా గబ్బి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె వరుణ్ ధావన్, కీర్తి సురేష్‌లతో కలిసి నటించిన బేబీ జాన్ చిత్రంలో తన అద్భుత నటనతో మెప్పించింది. అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించింది. తాజాగా, రణవీర్ సింగ్ సరసన శక్తిమాన్ చిత్రంలో నటించబోతోందనే వార్తలు వెలువడు తున్నాయి. వామికా గబ్బి త్వరలోనే టాలీవుడ్ స్టార్ నాని సరసన నటించనున్నట్టు సమాచారం. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ఆమె చేస్తున్న పాత్రలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
బేసిల్ జోసెఫ్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ముంబైలో రణవీర్ సింగ్‌తో స్క్రిప్ట్ రీడింగ్స్ జరుపుతున్నారని తెలుస్తోంది. శక్తిమాన్ ప్రాజెక్ట్ కోసం సోనీ పిక్చర్స్ ఇండియా, సాజిద్ నడియాడ్వాలా సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాగా ప్రణాళికబద్ధంగా రూపొందిస్తున్నారని, ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమైందని సమాచారం.
-
Home
-
Menu