'పుష్ప 2' రీ-లోడెడ్ వెర్షన్ ప్రోమో!

పుష్ప 2 రీ-లోడెడ్ వెర్షన్ ప్రోమో!
X
అర్జున్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2: ది రూల్’ జనవరి 17న రీలోడెడ్ వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సరికొత్త వెర్షన్‌కు 20 నిమిషాల అదనపు ఫుటేజ్ జోడించడంతో సినిమా మొత్తం నిడివి 3 గంటల 40 నిమిషాలుగా ఉంటుంది.



కొత్తగా జోడించిన సన్నివేశాల్లో పుష్ప, షెకావత్ మధ్య కీలక సన్నివేశాలు, తన సిండికేట్ సభ్యులతో మీటింగ్ కి సంబంధించిన సీన్స్, జపాన్ ఎపిసోడ్ లోని అసంపూర్ణంగా మిగిలిపోయిన సన్నివేశాలు ఉండబోతున్నట్టు లేటెస్ట్ గా రిలీజైన రీలోడెడ్ ప్రోమోను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే రూ. 1831 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం, రీలోడెడ్ వెర్షన్ ద్వారా రూ. 2000 కోట్ల వసూళ్ల మార్క్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story