టాలీవుడ్ టాప్ బ్యానర్ల నుంచి వెంకీకి ఆఫర్లు!

టాలీవుడ్ టాప్ బ్యానర్ల నుంచి వెంకీకి ఆఫర్లు!
X
వెంకటేష్ తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించిన మూడో సినిమా ఇది.

వెంకటేష్ తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించిన మూడో సినిమా ఇది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వింటేజ్ వెంకీని మళ్లీ చూడబోతున్నారని చిత్రబృందం చెబుతోంది.

జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం తర్వాత వెంకీ చేయబోయే మూవీ ఏంటి? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విషయంపై స్వయంగా వెంకీనే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తనతో పనిచేయడానికి టాలీవుడ్‌లోని నాలుగు ప్రముఖ బ్యానర్లు సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, సితార నాగవంశీ, వైజయంతి మూవీస్‌లు సిద్ధంగా ఉన్నాయని వెంకటేశ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఏ కథకు తాను ఓకే చెప్పలేదని.. తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన చేస్తానని తెలిపాడు.

Next Story