దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్

X
దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు కుటుంబంపై నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది.
ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమ కూల్చివేత కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
దక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో నందకుమార్ అనే బాధితుడు దగ్గుబాటి కుటుంబంతో వివాదంలో ఉన్నారు. ఈ స్థలం తమదని దగ్గుబాటి ఫ్యామిలీ వాదిస్తుండగా, నందకుమార్ హోటల్ నిర్వహణ కొనసాగిస్తున్నారు. 2022లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా కూల్చిన నేపథ్యంలో నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసును విచారిస్తుండగా, హైకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది.
2024 జనవరిలో హోటల్‌ను పూర్తిగా కూల్చివేయడంతో నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నాంపల్లి కోర్టు పోలీసులు పూర్తి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.
Next Story
-
Home
-
Menu