'తండేల్' నుంచి బుజ్జి తల్లి వీడియో సాంగ్!

తండేల్ నుంచి బుజ్జి తల్లి వీడియో సాంగ్!
X
నాగచైతన్య, సాయిపల్లవి 'తండేల్' విడుదలకు ఇంకా నెల రోజులు సమయం మాత్రమే ఉంది.

ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు మేకర్స్. గీతా ఆర్ట్స్2 పై చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'బుజ్జి తల్లి, నమో నమః శివ' రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ రెండు పాటలు వేటికవే విభిన్నంగా ఆకట్టుకున్నాయి.



లేటెస్ట్ గా 'బుజ్జి తల్లి' సాంగ్ వీడియో వెర్షన్ రిలీజ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతంలో శ్రీమణి రాయగా జావేద్ ఆలీ ఈ పాటను ఆలపించాడు. సముద్రం నేపథ్యంలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య రొమాంటిక్ మాంటేజెస్ తో ఈ వీడియో సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Next Story