సింహాచల గిరిప్రదక్షణలో భక్తుల సందడి

ఇంత భక్త జనసందోహం మునుపెన్నడూ చూడలేదంటున్న స్థానికులు;

Update: 2025-07-10 08:30 GMT

 "గిరి చుట్టూ భక్త జనమే..!" అన్నట్టు, గిరిప్రదక్షణ మార్గం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. మునుపెన్నడూ ఈ స్థాయిలో గిరిప్రదక్షణ జరగలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అంచనాలకు మించి భక్తులు రావడంతో అధికారులు తడబాటుకు లోనయ్యారు. అయినప్పటికీ, అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించి, ప్రదక్షణను ప్రశాంతంగా పూర్తి అవుతుంది అన్నారు అధికారులు.నిన్న మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదిక్షణ ఈరోజు మధ్యాహ్నం తో ముగుస్తుంది.భక్తుల భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మికతతో సింహాచలం పర్వతం కాంతిమంతమై నిలిచింది.


Tags:    

Similar News