వాహనచోదకుల‌కు ఇబ్బంది కలిగించిన యువకులు – డ్రోన్ కెమెరాలో బంధించిన పోలీసులు

ఫ్లైఓవర్‌పై ఫోటోషూట్లు, రేసులు చేస్తే కఠిన చర్యలు తప్పవు-డ్రోన్ బీట్‌లో చిక్కిన యువకులు – ఫోటోషూట్ మోజులో పోలీసుల కంటికి చిక్కారు;

Update: 2025-07-06 13:10 GMT

తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నగరం మరియు శివారు ప్రాంతాల్లో ప్రతి రోజు పగలూ డ్రోన్ కెమెరా ద్వారా బీట్ నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసరాల్లో డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో బీట్ నిర్వహణ జరిగింది.

ఈ సమయంలో తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై కొంతమంది యువకులు ఫోటోషూట్ పేరుతో వాహన చోదకులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో బంధించబడ్డాయి. డ్రోన్ కెమెరా తమను చిత్రీకరిస్తున్నట్లు గమనించిన యువకులు బైకులపై అక్కడి నుంచి పరారయ్యారు.

తర్వాతి విచారణలో ఎం.ఆర్.పల్లి పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు విద్యార్థులుగా గుర్తించబడ్డారు. మొదటి తప్పుగా పరిగణించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరికతో పంపివేశారు.

భవిష్యత్తులో నగరంలో గానీ, శివారులో గానీ, ఫ్లైఓవర్‌లపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఫోటోషూట్లు, బర్త్‌డే పార్టీలు, బైక్ రేసులు నిర్వహిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు పోలీసులు తెలిపారు.

ప్రమాదకరమైన రీతిలో ఫోటోషూట్లు నిర్వహించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఒక వేళ ప్రమాదం జరిగితే, మీ కుటుంబ సభ్యులు ఎలాంటి బాధను ఎదుర్కొంటారో ఒక్కసారి ఆలోచించాలని పోలీసులు యువతకు విజ్ఞప్తి చేశారు. వాహనచోదకుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించటం తగదని, అందుకే తగిన బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.


Tags:    

Similar News