హెచ్‌సీఏ అవినీతిపై ఉప్పల్ స్టేడియం వద్ద DYFI ఆందోళన

CID విచారణలో అవినీతి బయటపడిన హెచ్‌సీఏ – బాధ్యులపై చర్యలకు DYFI డిమాండ్;

Update: 2025-07-10 13:38 GMT

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ (SRH) మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)–ఎస్‌ఆర్‌హెచ్ మధ్య అవినీతికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఐపీఎల్ టికెట్లను అక్రమంగా విక్రయించారని, హెచ్‌సీఏ కార్యవర్గం మొత్తం దానికి సహకరించిందని DYFI నేతలు ఆరోపించారు. దాంతోపాటు వ్యాపారవేత్తలకు హెచ్‌సీఏ అధ్యక్ష పదవి అప్పగించడాన్ని DYFI తీవ్రంగా ఖండించింది. CID విచారణలో హెచ్‌సీఏలో అవినీతికి ఆధారాలు బయటపడ్డ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, CEO, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను పదవుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో DYFI రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్, తదితరులు పాల్గొన్నారు


Tags:    

Similar News