రాహుల్, సోనియాలకు భరోసా కలిగించిన సీఎం రేవంత్...తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డా !

సోనియా-రాహుల్‌కు చెప్పండి... 100 ఎమ్మెల్యేలు, 15 ఎంపీలు గెలుస్తాం: మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్ పవర్‌ఫుల్ స్పీచ్;

Update: 2025-07-05 12:03 GMT

నిన్న జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢమైన రాజకీయ ధీమాను మరోసారి ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

ఆయన మాట్లాడుతూ, ముందు ఎన్నికల సమయంలోనే రంగారెడ్డి జిల్లా నుంచి నేను సోనియాగాంధీగారికి చెప్పాను... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని,అని గుర్తు చేశారు.ఇప్పుడు అదే మాట మళ్లీ చెప్పుతున్నాను వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు, 15 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తామంటూ... సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మీరు చెప్పండి అని ఆయన మల్లికార్జున్ ఖర్గే గారిని చెప్తూ ముక్తకంఠంతో గర్జించారు.

ప్రజల నుంచి కాంగ్రెస్‌కు వస్తున్న మద్దతు చూస్తే, ఇక రాజకీయంగా ఎలాంటి సందేహమూ లేదు అని ఆయన స్పష్టం చేశారు.ప్రజలు మన పక్కనే ఉన్నారు... మనపై ఉన్న నమ్మకాన్ని మరింత బలపరచాలి. దేశంలోని రాజకీయ దిశను మార్చే శక్తి తెలంగాణలో ఉంది, అని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఈ సభ మొత్తం రేవంత్ రెడ్డి ధీమా, పట్టుదల, ప్రజలపై ఉన్న భరోసా తో నిండిపోయింది. కాంగ్రెస్ నేతలూ, కార్యకర్తలూ ఊహించని స్థాయిలో ఉత్సాహంతో ముచ్చటించుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News