క్యాన్సర్ బాధితుడు ఆకుల కృష్ణ కోరికను తీర్చిన సీఎం చంద్రబాబు
చంద్రబాబుతో మాట్లాడాలని ఆకాంక్షించిన కార్యకర్త కోరిక నెరవేర్చిన సీఎం;
By : Dasari Suresh
Update: 2025-07-06 07:24 GMT
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ టీడీపీ పట్ల గాఢమైన అభిమానంతో, చిన్ననాటి నుంచే కార్యకర్తగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన క్యాన్సర్ వ్యాధితో తీవ్రమైన అనారోగ్యానికి లోనై ఉన్నారు,. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఒకసారి అయినా సీఎం చంద్రబాబుతో మాట్లాడాలనే కోరికను వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం స్వయంగా వీడియో కాల్ ద్వారా ఆకుల కృష్ణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో కృష్ణ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ కాల్ తాను మరిచిపోలేనిదని, ఇప్పుడు తనకు ఒకింత సంతృప్తి లభించిందని భావోద్వేగంతో తెలిపారు.