'జన నాయకుడు'గా విజయ్!
దలపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.;
దలపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈరోజు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘ఫస్ట్ రోర్’ టీజర్ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
ఈ టీజర్ లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో విజయ్ స్టైలిష్ లుక్, మాస్ అప్పీల్, అతని సిగ్నేచర్ గెట్చర్స్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. 'పవర్ కోసం కాదు… ప్రజల కోసమే నాయకుడు ఎదుగుతాడు' అనే డైలాగ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పొలిటికల్ థీమ్ ఉండబోతున్నట్టు తెలియజేస్తుంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ మాస్ గ్లింప్స్‌కు అదనపు బలాన్ని చేకూర్చింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఒక శక్తివంతమైన ఆరంభంగా కనిపిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ వంటి నటులు నటిస్తున్నారు. 2026 జనవరి 9న సంక్రాంతి, పొంగల్ స్పెషల్ గా 'జన నాయకుడు' విడుదలకు ముస్తాబవుతుంది.