తిరుపతిలో ‘వీరమల్లు‘ ప్రీ రిలీజ్

జూన్ 12న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగ రోజు. నాలుగేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ‘హరిహర వీరమల్లు‘ విడుదలవుతోన్న రోజది.;

By :  S D R
Update: 2025-06-03 06:57 GMT

జూన్ 12న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగ రోజు. నాలుగేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ‘హరిహర వీరమల్లు‘ విడుదలవుతోన్న రోజది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడిక్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేయబోతుంది టీమ్. ఇప్పటివరకూ చిత్రబృందం అంతా ప్రచారంలో పాల్గొంటుండగా.. ఈసారి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ప్రచార రంగంలోకి దూకబోతున్నాడు.

ఈనెల 8న తిరుపతి ఎస్వీయూ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ‘హరిహర వీరమల్లు‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నాడు. మరోవైపు సెన్సార్ కార్యక్రమాల కోసం సిద్ధమవుతోన్న ‘వీరమల్లు‘ నుంచి ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంగా.. పవన్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు‘ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News