విజయాలు మీవి.. ప్లాపులు నావి!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 5న విడుదలకానుంది.;

By :  S D R
Update: 2025-05-30 02:40 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ఒకటి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 5న విడుదలకానుంది. త్రిష, శింబు, నాజర్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.

లేటెస్ట్ గా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'నేను 15 తెలుగు సినిమాలు చేశాను. అందులో 13 సినిమాలు విజయవంతం అయ్యాయి. ఆ విజయాలను మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రం నేను ఇచ్చాను.. ఇది నిజం' అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అలాగే కమల్ హాసన్ మాట్లాడుతూ, '21 ఏళ్ల వయసులో మొదటిసారి వైజాగ్‌కి వచ్చాను. అప్పటికి నా మొహం ఎవరికీ తెలియదు. కానీ 'మరో చరిత్ర' సినిమా తర్వాత నన్ను ఎక్కడా నడవనివ్వని ఫ్యాన్ బేస్ ఇక్కడ ఏర్పడింది. 'సాగర సంగమం', 'శుభసంకల్పం' వంటి సినిమాలు ఇక్కడే చేశాను. ఇక్కడి ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు' అని గుర్తు చేశారు.

తాను చేసిన కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ ను ప్రేక్షకులు మర్చిపోయారని, మంచి సినిమాలనే గుర్తుపెట్టుకున్నారన్న కమల్ హాసన్, 'ఒక కళాకారుడు చేసే నిజాయితీ పని ఏమిటంటే, మంచి సినిమా ఇవ్వడం. ‘థగ్ లైఫ్’ అలాంటి ప్రయత్నం. మీ రియాక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మీ స్పందనే నా హార్ట్ బీట్' అని పేర్కొన్నారు.

శింబు మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమా మీకు నచ్చుతుందని నమ్మకం,' అన్నారు. పవన్ కళ్యాణ్‌ కోసం 'ఓజీ'లో పాడిన పాట త్వరలో విడుదలవుతుందని తెలిపారు. త్రిష మాట్లాడుతూ, 'వర్షం' సినిమా తర్వాత 22 ఏళ్లు గడిచినా మీ ప్రేమ ఎప్పటికీ మారదు. ఈ సినిమాలో చేసిన ‘ఇంద్రాణి’ పాత్ర మీకు గుర్తుండిపోతుంది' అన్నారు.

Tags:    

Similar News