‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లీకొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది.;

By :  S D R
Update: 2025-04-03 11:29 GMT

నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తల్లీకొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 18న ‘అర్జున్ S/O వైజయంతి’ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది.

‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ‘కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు‘ అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మరోసారి గుర్తు చేశారు మేకర్స్. ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపించబోతుంది. ఆమె కొడుకు పాత్రలో అర్జున్ గా కళ్యాణ్ రామ్ అలరించనున్నాడు.

కళ్యాణ్ రామ్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటించగా.. మరో కీలకమైన పాత్రలో సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కనిపించనున్నాడు. ‘కాంతార, విరూపాక్ష‘ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఈ మూవీకి టెక్నికల్ గా ఎంతో ప్లస్ కానుంది. మొత్తంగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే కళ్యాణ్ రామ్, విజయశాంతి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రచారంలో జోరు పెంచారు. లేటెస్ట్ గా అనిల్ రావిపూడి వీరిద్దరితో ఓ ఇంటర్యూ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

Tags:    

Similar News