పెళ్లి సందడితో ‘ఘాటి‘ పాట!

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల అనుష్క నుంచి రాబోతున్న చిత్రం ‘ఘాటి‘. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.;

By :  S D R
Update: 2025-06-21 15:08 GMT

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ తర్వాత అందాల అనుష్క నుంచి రాబోతున్న చిత్రం ‘ఘాటి‘. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘వేదం‘ సినిమా రావడంతో ‘ఘాటి‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క గిరిజన ప్రాంతంలో నివసించే ఓ మహిళగా కనిపించబోతుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అనుష్క రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కకి జోడీగా తమిళ హీరో విక్రమ్ ప్రభు నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సాలోరే అంటూ సాగే గీతం విడుదలైంది.

హీరోహీరోయిన్లు విక్రమ్ ప్రభు, అనుష్క లపై చిత్రీకరించిన ఈ గీతం పెళ్లి నేపథ్యంలో ఆకట్టుకుంటుంది. సాగర్ నాగవెల్లి మ్యూజిక్ లో క్రిష్ స్వయంగా రాసిన ఈ పాటను లిప్సిక భాష్యం, సాగర్ నాగవెల్లి, సోనీ కోమండూరి ఈ పాటను ఆలపించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 11 న థియేటర్లలోకి రానుంది.


Full View


Tags:    

Similar News