‘పెద్ది’ ఫస్ట్ లుక్ హిట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు.. టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. అలాగే రెండు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు.;

By :  S D R
Update: 2025-03-27 03:56 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు.. టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. అలాగే రెండు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న 'పెద్ది' టైటిల్ నే ఈ మూవీకి ఫిక్స్ చేయడం విశేషం. అయితే 'పెద్ది' నుంచి ఈరోజు గ్లింప్స్ వస్తుందని ఆశించినా.. ఉగాదికి ఆ ఫీస్ట్ ను అందించనుందట టీమ్.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ లుక్ రగ్గడ్ గా ఉంది. పెరిగిన జుట్టు, గుబురు గడ్డం, ముక్కుకు రింగు, నోటిలో బీడి తో చరణ్ ఎంతో మాసీగా కనిపిస్తున్నాడు. మరొక పోస్టర్ లో బ్యాట్ పట్టుకుని ఉన్నాడు. మొత్తంగా ఇప్పటివరకూ కనిపించనటువంటి ఊర మాస్ లుక్ లో 'పెద్ది' కోసం మేకోవర్ అయ్యాడు చెర్రీ.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా 'పెద్ది'కి పెద్ద ప్లస్ పాయింట్స్. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News