'కూలీ'కి కౌంట్‌డౌన్ స్టార్ట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కూలీ' రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది.;

By :  S D R
Update: 2025-05-06 16:23 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'కూలీ' రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ కు వంద రోజులు మాత్రమే ఉందంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్.

ఈ వీడియోలో సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర, కింగ్ నాగార్జున లు కూడా కనిపిస్తున్నారు. అయితే.. వీరంతా వెనుక నుంచి నిలబడి ఉన్నారు. చివరగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ.. దానికి అనిరుధ్ బి.జి.ఎమ్. ఈ వీడియోలో హైలైట్ గా ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఆగస్టు 14నే ఎన్టీఆర్-హృతిక్ రోషన్ 'వార్ 2' కూడా విడుదలవుతుండటం విశేషం.


Full View


Tags:    

Similar News