‘తెలుసు కదా‘ రిలీజ్ డేట్ ఫిక్స్!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీస్ లో ‘తెలుసు కదా‘ ఒకటి. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.;
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీస్ లో ‘తెలుసు కదా‘ ఒకటి. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. రొమాంటిక్ ట్రయాంగులర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘తెలుసు కదా‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది టీమ్. ఈ వీడియోలో సిద్ధుకి హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా వీడియో కాల్ చేయడం.. ఇద్దరితో ట్రయాంగులర్ లవ్ స్టోరీ నడిపే సిద్ధు.. వారిని మేనేజ్ చేయడానికి ట్రై చేయడం ఈ వీడియోలో ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో రాశీ ఖన్నా మరాఠీ అమ్మాయిగా, శ్రీనిధి కన్నడ అమ్మాయిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ‘టిల్లు‘ సిరీస్ తర్వాత ‘జాక్‘తో ఆకట్టుకోలేకపోయిన సిద్ధు.. ఇప్పుడు ‘తెలుగు కదా‘తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.