యాక్షన్‌ సీక్వెన్స్ తో తారక్ ఎంట్రీ!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్‘. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టులోకి ఇప్పుడు యంగ్ టైగర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.;

By :  S D R
Update: 2025-04-17 11:33 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్‘. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టులోకి ఇప్పుడు యంగ్ టైగర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడు తారక్. మే 15 వరకూ ఈ షెడ్యూల్ కొనసాగనుందట.

‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ చిత్రాలతో ప్రశాంత్ సృష్టించిన యాక్షన్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక యాక్షన్ తెరకెక్కించడంలో మాస్టర్ అయిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో తొలి షెడ్యూల్ లోనే ఓ హై వోల్టేజ్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశాడట. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోయే యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రంగంలోకి దిగుతున్నారట. అత్యాధునిక టెక్నాలజీతో ఈ సీక్వెన్స్ ను తీర్చిదిద్దనున్నారట. ఎలాగూ యాక్షన్ లో చెలరేగిపోయే తారక్.. ప్రశాంత్ నీల్ కోసం మరింత రగ్గడ్ గా రెచ్చిపోనున్నాడట.

ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటించనుందనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

Tags:    

Similar News