'హిట్ 3' నుంచి సర్ప్రైజ్!
సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'హిట్ 3'. అంతకు ముందు నిర్మాతగా 'హిట్' సిరీస్ ను తీర్చిదిద్దిన నాని, ఇప్పుడు ఈ సినిమాతో హీరోగానూ అలరించబోతున్నాడు.;
సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 'హిట్ 3'. అంతకు ముందు నిర్మాతగా 'హిట్' సిరీస్ ను తీర్చిదిద్దిన నాని, ఇప్పుడు ఈ సినిమాతో హీరోగానూ అలరించబోతున్నాడు. ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా, వేసవి కానుకగా మే 1న థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
దర్శకుడు శైలేష్ కొలను ఈ సారి కథనాన్ని మరింత రక్తి కట్టించేలా, సస్పెన్స్‌తో నిండిన యాక్షన్ డ్రామాగా మలచినట్టు సమాచారం. టీజర్‌తో పాటు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో, ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం, ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.
‘అబ్ కీ బార్ అర్జున్ సర్కార్’ అనే ఆసక్తికరమైన స్లోగన్‌తో వస్తున్న ఈ సెకండ్ సింగిల్, ఈరోజు (ఏప్రిల్ 9)న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. ఈ టైటిల్ చూస్తుంటే, నాని పాత్రకు ఓ పవర్‌ఫుల్ డైమెన్షన్ ఉండేలా అనిపిస్తోంది.
ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, కోమలి ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమాస్ పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.