'రెట్రో' ట్రైలర్.. సూర్య వింటేజ్ వార్!
విలక్షణ నటుడు సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. సూర్య హీరోగా భారీ అంచనాలతో వచ్చిన 'కంగువా' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు 'రెట్రో' సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు సూర్య.;
విలక్షణ నటుడు సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. సూర్య హీరోగా భారీ అంచనాలతో వచ్చిన 'కంగువా' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు 'రెట్రో' సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటించగా.. ఇతర కీలక పాత్రల్లో జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
లేటెస్ట్ గా 'రెట్రో' మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. 'రెట్రో' పేరులోని ఇదొక వింటేజ్ డ్రామా అని అర్థమవుతుంది. ఇక.. ముఫ్ఫై, నలభై ఏళ్ల క్రితం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందిన ఈ మూవీలో సూర్య వింటేజ్ లుక్ ఆకట్టుకుంటుంది. రెండు గ్యాంగ్స్, వాటి మధ్య వార్ ఇతివృత్తంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది.
ముఖ్యంగా ఈ మూవీని కార్తీక్ సుబ్బరాజ్ తన మార్క్ గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్ తో పాటు.. రొమాంటిక్ డ్రామాగా తీర్చిదిద్దినట్టు అర్థమవుతుంది. మరోవైపు తండ్రీకొడుకులుగా కనిపించనున్న జోజు జార్జ్, సూర్య మధ్య వార్ సమ్‌థింగ్ స్పెషల్ గా ఉండబోతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతుంది. మే 1న 'రెట్రో' రిలీజ్ కు రెడీ అవుతుంది.