‘విశ్వంభర‘ నుంచి సాంగ్ ప్రోమో!

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ పాటల పాండగ మొదలవుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా రేపు ‘విశ్వంభర‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రామ రామ‘ రాబోతుంది.;

By :  S D R
Update: 2025-04-11 06:06 GMT

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ పాటల పాండగ మొదలవుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా రేపు ‘విశ్వంభర‘ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రామ రామ‘ రాబోతుంది. లేటెస్ట్ గా అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో చూస్తుంటే ఈ పాట చాలా గ్రాండ్యుయర్ విజువల్స్ తో తెరకెక్కినట్టు అనిపిస్తుంది.

ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ కూడా కనిపించనున్నాడట. ఆస్కార్ విజేత కీరవాణి స్వరకల్పనలో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. హనుమాన్ జయంతి సందర్భంగా రేపు ఉదయం 11.12 గంటలకు ఈ పాట రాబోతుంది.


Full View


Tags:    

Similar News