రిషబ్ కి పోటీగా రితేష్
ఈ మధ్యకాలంలో చారిత్రక గాథలు, పౌరాణిక పాత్రలు ఆధారంగా రూపొందుతున్న సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర గర్వంగా భావించే మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో రెండు భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి.;
ఈ మధ్యకాలంలో చారిత్రక గాథలు, పౌరాణిక పాత్రలు ఆధారంగా రూపొందుతున్న సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర గర్వంగా భావించే మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో రెండు భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి.
ఇప్పటికే శివాజీ జీవిత కథ ఆధారంగా 'కాంతార' స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఒక బయోపిక్ రూపొందుతుంది. 'ది ప్రైడ్ ఆఫ్ భారత్.. ఛత్రపతి శివాజీ మహారాజ్' బయోపిక్ 2027, జనవరిలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సినిమాలో శివాజీ మహారాజ్ పాత్రను రిషబ్ శెట్టి పోషిస్తున్నాడు. సందీప్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.
మరోవైపు మరాఠీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తూ, ఛత్రపతి శివాజీ పాత్రను కూడా తానే పోషిస్తూ 'రాజా శివాజీ' చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. 2026లోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.