పవన్ లేదా ఎన్టీఆర్? నాగవంశీ క్లారిటీ ఇచ్చేశారు!
టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైన్‌మెంట్స్ ది ప్రత్యేక స్థానం. వరుస విజయాలతో పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ, అతి తక్కువ కాలంలోనే అత్యంత విశ్వసనీయమైన బ్యానర్‌గా మారింది. నిర్మాత నాగవంశీ నడిపిస్తున్న తీరు ఈ సంస్థను టాప్ ప్రొడక్షన్ హౌస్‌ల జాబితాలో నిలిపింది.;
టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో సితార ఎంటర్టైన్‌మెంట్స్ ది ప్రత్యేక స్థానం. వరుస విజయాలతో పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ, అతి తక్కువ కాలంలోనే అత్యంత విశ్వసనీయమైన బ్యానర్‌గా మారింది. నిర్మాత నాగవంశీ నడిపిస్తున్న తీరు ఈ సంస్థను టాప్ ప్రొడక్షన్ హౌస్‌ల జాబితాలో నిలిపింది. ఈ సంస్థ నుంచి మార్చి 28న 'మ్యాడ్ స్క్వేర్' రాబోతుంది. ఈ సందర్భంగా 'మ్యాడ్ స్క్వేర్' హీరో సంగీత్ శోభన్ వ్యాఖ్యతగా సితార అధినేత నాగవంశీ, మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ లతో ఇంటర్యూ చేశాడు.
ఈ ఇంటర్యూలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు నాగవంశీ. ముఖ్యంగా సితార సంస్థ త్వరలోనే 50వ సినిమా మైలురాయికి చేరుకోబోతోంది. ఇదే విషయాన్ని హీరో సంగీత్ శోభన్ ప్రస్తావిస్తూ.. 'ఈ బ్యానర్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఒకరితో 50వ సినిమా చేయాల్సి వస్తే, ఎవరిని ఎంచుకుంటారు?' అనే ప్రశ్నను నాగవంశీకి సంధించారు.
దీనిపై నాగవంశీ ఎంతో స్పష్టంగా సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దాదాపు స్థిరపడి పోయారని, ఇకపై రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారు అనే కోణంలో చూడాలని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కాకుండా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పాటు కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తూ, జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన నుంచి కొత్త ప్రాజెక్ట్ కమిట్‌మెంట్ రావడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
దీంతో, సితార 50వ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కంటే ఎన్టీఆరే సరైన ఎంపిక అవుతారని నాగవంశీ తేల్చిచెప్పారు. ప్రాక్టికల్ యాంగిల్‌లో చూస్తే కూడా ఇది నిజమే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యారు, వాటిని పూర్తిచేయడానికి కూడా సమయం కుదిరేలా లేదు. దీంతో, కొత్త ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్‌ను ఎంచుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.