మళ్లీ మొదలైన ‘ఓజీ‘
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ మోడ్ లోకి ఎంటరవ్వబోతున్నాడు. ఇప్పటికే తన లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు‘ను ఫినిష్ చేసిన పవర్ స్టార్.. ఇప్పుడు ‘ఓజీ‘ని రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడట.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్ మోడ్ లోకి ఎంటరవ్వబోతున్నాడు. ఇప్పటికే తన లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు‘ను ఫినిష్ చేసిన పవర్ స్టార్.. ఇప్పుడు ‘ఓజీ‘ని రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడట.
ఈరోజు నుంచి ‘ఓజీ‘ చిత్రాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని ఈ సినిమా కెమెరా డిపార్ట్ మెంట్ లోని ఓ టీమ్ మెంబర్ తెలియజేశాడు. ఇక ఈ వారంలోనే ఈ సినిమా షూట్ లో పవన్ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సుజీత్ ‘ఓజీ‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు పాల్గొంటే సరిపోతుందట. మొత్తంగా.. ఈ ఏడాది పవన్ నుంచి ‘హరి హర వీరమల్లు‘తో పాటు ‘ఓజీ‘ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.