ఎన్టీఆర్-వై.వి.ఎస్. చిత్రం ప్రారంభం!

నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడిగా నందమూరి తారక రామారావు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు.;

By :  S D R
Update: 2025-05-12 07:36 GMT

నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం వారసుడిగా నందమూరి తారక రామారావు హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు.నటరత్న ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడైన తారక రామారావు.. ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి చేతుల మీదుగా తెరంగేట్రం చేస్తుండటం విశేషం.

‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్‌పై వైవిఎస్ చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. 60 ఏళ్ల క్రితం ఇదే రోజు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘తోడు నీడ’ చిత్రం విడుదలవవ్వడం విశేషం.

ఈ వేడుకకు నారా భువనేశ్వరి, దుగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. భువనేశ్వరి, హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి కొత్త జంటకు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో తారక రామారావుకి కథానాయికగా వీణారావు నటిస్తుంది. కూచిపూడి నర్తకి అయిన ఈ తెలుగు అమ్మాయికి ఇదే తొలి చిత్రం.

ఈ సినిమా కథాంశం 1980ల కాలానికి సంబంధించిన నేపథ్యంలో సాగనుందట. తెలుగు సంస్కృతి, భాష, నాటి సమాజంలోని విలువలను ప్రతిబింబించేలా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండగా, చంద్రబోస్ గీత రచయితగా, సాయి మాధవ్ బుర్రా మాటల రచయితగా పనిచేస్తున్నారు.

Tags:    

Similar News