ఎన్టీఆర్-నెల్సన్ కాంబో ఫిక్స్!

టాలీవుడ్ మాస్ మంత్ర ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోగా మారిపోయాడు. ఇటీవల 'దేవర' చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసి అక్కడ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నాడు తారక్.;

By :  S D R
Update: 2025-04-05 03:19 GMT

టాలీవుడ్ మాస్ మంత్ర ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరోగా మారిపోయాడు. ఇటీవల 'దేవర' చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసి అక్కడ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నాడు తారక్. ఇక లేటెస్ట్‌గా హైదరాబాద్ లో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ లో సందడి చేశాడు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్ గురించి ఆసక్తికర అప్డేట్స్ అందించాడు.

ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ‘వార్-2’ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా షూట్‌లో పాల్గొంటాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చేయబోయే తన మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ 'దేవర 2'పైనా అప్డేట్ ఇచ్చాడు. 'దేవర' ఘన విజయం సాధించినా.. 'దేవర 2' ఉంటుందా? లేదా? అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 'దేవర 2' ఉంటుందని 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు తారక్.

అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి ఓ సినిమా చేయబోతున్నానని.. తన మరో ప్రాజెక్ట్‌పైనా ఎన్టీఆర్ అధికారికంగా ప్రకటించాడు. ఇది 'నెక్స్ట్ లెవెల్' ప్రాజెక్ట్ అవుతుందని చెబుతూ, ఆ రోజు మీ అందరిని 'హ్యాండిల్ చేయడమే వంశీ బాధ్యత' అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్లతో, ఈ సినిమా 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లోనే ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే నాగవంశీ.. డైరెక్టర్ నెల్సన్‌తో ఓ స్టార్ హీరో సినిమా ఉండబోతోందని సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు తారక్ స్టేట్‌మెంట్‌తో ఇది ఖరారైనట్టే!

Tags:    

Similar News