జపాన్‌లో దేవర హవా!

తెలుగు సినిమాలకు జపాన్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలు అక్కడ విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి.;

By :  S D R
Update: 2025-03-24 14:30 GMT

తెలుగు సినిమాలకు జపాన్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలు అక్కడ విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర పార్ట్ 1' జపాన్‌లో మార్చి 28న విడుదల కానుండటంతో తారక్ స్వయంగా అక్కడికి వెళ్లి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.

జపాన్‌లో విడుదలకు ముందు మార్చి 19న ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరగగా, అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో జపాన్ లో ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో 'దేవర' కోసం ఆ దేశంలో అభిమానులు ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవర'కి కొనసాగింపుగా రెండో భాగం రానుంది. అయితే ప్రస్తుతం 'వార్ 2'తో బిజీగా ఉన్న తారక్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ను ఫినిష్ చేస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత 'దేవర 2'లో నటిస్తాడట.

Tags:    

Similar News