జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.;
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మోహన్‌లాల్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. ఉత్తమ నటుడి అవార్డు షారూఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ (12th ఫెయిల్) అందుకున్నారు. ఉత్తమ నటి రాణి ముఖర్జీ, ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ నిలిచింది.
తెలుగు విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రం – భగవంత్ కేసరి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ – హనుమాన్, బెస్ట్ యానిమేషన్ విజువల్స్, గేమింగ్ & కామిక్ – హనుమాన్, బెస్ట్ లిరిక్స్ – బలగం (ఊరు పల్లెటూరు పాట), బెస్ట్ స్క్రీన్ ప్లే – సాయి రాజేష్ నీలం (బేబీ), బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (బేబి) – రోహిత్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) అవార్డులు అందుకున్నారు.