తెలుగు దేశం పార్టీకి నాగవంశీ విరాళం!
తెలుగు దేశం పార్టీకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ రూ.25 లక్షలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తమ రాజకీయ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు నిధుల సేకరణలో భాగంగా విరాళాలు అందుకుంటుంది.;
తెలుగు దేశం పార్టీకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ రూ.25 లక్షలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తమ రాజకీయ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు నిధుల సేకరణలో భాగంగా విరాళాలు అందుకుంటుంది. ఈనేపథ్యంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి సూర్యదేవర నాగవంశీ రూ.25 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.
ఈ విరాళం టీడీపీ వార్షిక మహానాడు సందర్భంగా అందించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రస్తావించారు. ఈ విరాళం ద్వారా నాగవంశీ టీడీపీకి తన మద్దతును వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నాగవంశీ ఔదార్యాన్ని ప్రశంసించారు.
ఈ విరాళం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించబడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల టీడీపీ తమ సభ్యత్వ డ్రైవ్‌లో 94 లక్షల మంది సభ్యులను చేర్చుకుని రికార్డు సృష్టించిన నేపథ్యంలో, ఈ విరాళం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చనుంది.
మరోవైపు నాగవంశీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఇప్పటికే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలను అందించి.. ఇప్పుడు వరుసగా మరిన్ని క్రేజీ మూవీస్ ను నిర్మిస్తున్నారు.