'విశ్వంభర' నుంచి మెగా అప్డేట్!

మెగా మూవీ 'విశ్వంభర' నుంచి మెగా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఏప్రిల్ 12న 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'రామ రామ' పాటను విడుదల చేయబోతున్నారు.;

By :  S D R
Update: 2025-04-10 05:54 GMT

మెగా మూవీ 'విశ్వంభర' నుంచి మెగా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఏప్రిల్ 12న 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ గా 'రామ రామ' పాటను విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి.. హనుమాన్ గెటప్స్ లో ఉన్న పలువురు చిన్నారులతో కలిసి సందడి చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి-కీరవాణి కాంబోలో వస్తోన్న మూవీ 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ తో రాబోతున్న ఈ చిత్రంలోని పాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయని చెబుతోంది టీమ్. ఈ పాటలో చిరంజీవితో పాటు సాయిదుర్గా తేజ్ కూడా కనిపిస్తాడట.

మొత్తంగా వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే 'విశ్వంభర' రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News